Guidelines for Filmmaking with In-Film Branding


What to do? What not to do? How to generate an In-Film Branding fund to filmmaking?

In-film branding means nothing more than marketing corporate brands or products through movies.

Do you believe,  we are coexisting with millions of brands, products made by corporate companies? 

కాని ఇది 100% నిజం. మనిషి తన దైనందిన నిత్య జీవితంలో ఉదయం లేవగానే వాడే పేస్ట్, బ్రెష్, స్నానపు సబ్బు, బట్టల సబ్బు మొదలుకొని ఇంట్లో వాడే, ఉప్పు, పసుపు, కారం, పప్పు, చింతపండు, బియ్యం, చక్కెర, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపపప్పు, వంటనూనె, జుట్టునూనె, వాషింగ్ సర్ఫ్, ఫ్లోర్ క్లీనర్, పాత్రలు కడిగే సబ్బు, వేసుకునే బట్టలు, వాడే పౌడరు, ఇంట్లో వాడే గ్యాసు, పొయ్యి, కుక్కరు, పిల్లకు ఇచ్చే బిస్కెట్లు, చాకొలెట్లు, ఎనర్జీ జ్యూస్, గోడకు వేసే రంగు, గోడపై వేలాడదీసే వాచ్, కరెంటు బల్బు, సీలింగ్ ఫ్యాను, ఇంట్లోని ప్రిడ్జు, ప్రిడ్జులోని బ్రెడ్డు, వ్రాసుకునే నోట్సు, వ్రాసే పెన్ను, పెన్సిల్, స్కెచ్, ముఖానికి వేసుకునే పౌడరు, వ్రాసుకునే క్రీము, పెట్టుకునే బొట్టు,.. ఇలా చివరికి దేవుడి పూజలో వాడే అగరుబత్తీలు, సాంబ్రాని ధూపం దాకా పరీక్షగా గమనిస్తే సుమారు 100 దాకా బ్రాండ్స్ లేదా ఆయా బ్రాండ్స్ వారు తయారు చేసే ఉత్పత్తులు ఒక సాధారణ మధ్యతరగతి వారి ఇంట్లో సాక్షాత్కారం చేస్తాయి.

సింపుల్ గా చెప్పాలంటే ఒక్క సాధారణ ట్రేడ్ పోర్టల్ లో సుమారు 12,000 ప్రొడక్ట్ లు, 55,000 సబ్-ప్రొడక్ట్ లు దర్శనమిస్తున్నాయి. అదే అంతర్జీతీయ స్థాయి ఈ-కామర్స్ పోర్టల్ లో కొన్ని లక్షల ప్రొడక్ట్ లు ఆన్ లైన్ లో నిత్యం శరవేగంగా అమ్ముడుపోతున్నాయి. ఉదాహరణకు అమెజాన్ గురించి చాలా మందికి తెలుసు, కాని ఒక్క అమెజాన్ రోజువారీ చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన ఉప సంస్థలు దాదాపు 800. ఆ కంపెనీల పేటెంట్ కోసం అమెజాన్ రిజిస్టర్ చేసుకుందంటే మీరు నమ్ముతారా. కాని అది పచ్చి నిజం. ఒక్క అమెజాన్ సుమారు 800 వేర్వేరు కంపెనీలతో వివిధ వ్యాపారాలను నిర్వహిస్తోంది. అందుకే ... ఇది బ్రాండ్ లు, ఆయా బ్రాండ్లు తయారు చేసే ప్రొడక్ట్ ల ప్రపంచం. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్లు "అగ్గిపుల్లా, కుక్కపిల్లా.. సబ్బుబిల్లా" కాదేదీ కవితకు అనర్హం... మరి ఇప్పుడు దానిని "అగ్గిపుల్లా, కుక్కపిల్లా.. సబ్బుబిల్లా .. కాదేదీ బ్రాండు కనర్హం" అని చదువుకోవలసిందే.(కుక్కపిల్ల బ్రాండు కాదనుకేరు ... వాటిల్లో కూడా చాలా చాలా బ్రీడ్లు ఉన్నాయి, వీట్లో కొన్నిరకాల బ్రీడ్ కుక్కపిల్లలు లక్షరూపాయలు పెడితేగానీ దొరకవు, అవికూడా బ్రాండ్లూ... స్టేటస్ సింబల్సే).

కార్పోరేట్ బ్రాండ్స్ లేదా ప్రొడక్ట్స్ మార్కెటింగ్:

మార్కెట్లో ఉన్న కొన్ని లక్షల బ్రాండ్స్ మరియు ప్రొడక్ట్ లను వినియోగదారుల చేత కొనిపించాలంటే, ఆయా ప్రొడక్ట్స్ లేదా బ్రాండ్స్ లకు ప్రచారం అవసరం. 98% వస్తువులు లేదా సర్వీసులకు ప్రచారం లేకుంటే అమ్ముడుపోవనే విషయం జగమెరిగిన సత్యం. ఆయా వస్తులు మరియు సర్వీసులకు ప్రచారం చేయడంకోసం కార్పోరేట్ కంపెనీలు అనేక ప్రచార పద్దతులను అనుసరిస్తారు. వాటిల్లో వాల్ పెయింటింగ్, పోస్టర్ పబ్లిసిటీ, పాంప్లెట్ పబ్లిసిటీ, టెలివిజన్ పబ్లిసిటీ,, న్యూస్ పేపర్ పబ్లిసిటీ, నెట్ వర్కింగ్ పబ్లిసిటీ, అవేర్ నెస్ ప్రోగ్రాం లు... ఇలా పబ్లిసిటీ మార్గాలు కొన్ని వందలరకాలు. అయితే తమ ఉత్పత్తులను వేగంగా వినియోగదారునికి చేరువ చేయాలనీ, తమ పోటీ దారునికన్నా ముందే తమ ఉత్పత్తిని వినియోగదారునిచేత కొనిపించాలని ప్రతి కార్పోరేట్ కంపెనీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే, కొన్ని కార్పోరేట్ కంపెనీలు సినిమాల ద్వారా తమ ప్రొడక్ట్ లు, బ్రాండ్ నేం, సర్వీస్ తదితరాలను ప్రేక్షకునికి చేయడం కోసం చేసే ప్రచార ప్రక్రియే ఇన్-ఫిలిం బ్రాండింగ్. ఇక్కడే అసలు ఇన్-ఫిలిం బ్రాండింగ్ మొదలవుతుంది.

ఇన్-ఫిలిం బ్రాండింగ్ కు 100 సంవత్సరాల చరిత్ర

ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ కు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1919లో హాలీవుడ్ చిత్రం "ద గరేజ్" చిత్రంతో ఈ ఇన్-ఫిలిం బ్రాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 1950 వ దశకంలో ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ కాన్సెప్ట్ "శ్రీ 420" హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. గత మూడు దశాబ్దాలుగా దక్షిణ భారత చలన చిత్ర నిర్మాతలు కూడా ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ నుండి లాభం పొందుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ఈ ఇన్-ఫిలిం కాన్సెప్ట్ విరివిగా అభివృద్ది చెందింది, మరియు చాలా మంది చిత్రనిర్మాతలు ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ నుండి నిధులు పొందడానికి ప్రయత్నిస్తున్నారు మరియు దాని ద్వారా వారు చిత్రనిర్మాణ బడ్జెట్‌ను తగ్గించాలని కోరుకుంటారు. ప్రస్తుతం, హాలీవుడ్‌లో 85% సినిమాలు తమ చిత్రాలకు ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి కార్పోరేట్ బ్రాండ్‌లతో కలిసి ముందుకెళుతున్నారు. ఇది బాలీవుడ్ లో 65% శాతంకాగా, దక్షిణ భారత దేశంలో 35%-40% దాకా ఉంది. ఈ ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా, చిత్రనిర్మాతలు సినిమా బడ్జెట్‌లో 5% -70%, కొన్నిసార్లు 100% మరియు అంతకంటే ఎక్కువ కూడా పొందుతున్నారు.

ఇన్-ఫిలిం బ్రాండింగ్ పట్ల కార్పోరేట్ కంపెనీలు ముందడుగు

సాంప్రదాయ బ్రాండ్ కమ్యూనికేషన్ మరియు అడ్వర్టైజింగ్ విధానం వల్ల వినియోగదారులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యేకింగ్ అడ్వర్టైజ్ మెంట్లను చూసే ఓపిక, ఇష్టం ప్రస్తుతం వినియోగ దారులలో కనిపించడం లేదు. వినోదాత్మక విధానంలో చూయించే సినిమాలలో భాగంగా, కార్పోరేట్ అడ్వర్ టైజింగ్ కు స్థానం కల్పిస్తే, వినియోగ దారులు దానిని అడ్వర్టైజ్ మెంట్ లగా భావించకుండా, సినిమాలో భాగంగా ఆస్వాదిస్తున్నారు. మరియు ఇటువంటి ప్రొమోషన్స్ ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం ఉంటూ, వారిని ప్రభావితం చేస్తున్నాయని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. అందుకోసం, కాస్త ఖర్చు ఎక్కువయినా ప్రముఖ నిర్మాణ సంస్థలు, పెద్ద తారాగణం ఉండే చిత్రాలపట్ల ఆసక్తి చూపుతూ, వారి చిత్రాలలో ఇన్-ఫిలిం బ్రాండింగ్ కోసం కంపెనీలు చేతులు కలుపుతున్నాయి. పెద్దవారి చిత్రాలలో తమ బ్రాండింగ్ ఉంటే, ఆ సినిమా విజయవంతమైనా... కాకపోయినా, ఎప్పటికీ ఆయా నటీనటుల అభిమానులు ఆ సినిమాను చూస్తూనే ఉంటారు. థియేటర్, టెలివిజన్, డిజిటల్, ఇంటర్నేషనల్, ఓటీటీ, డబ్బింగ్ లాంటి విభిన్న ప్రసార మాధ్యమాలలో ఆ చిత్రం ప్రదర్శిస్తూనే ఉంటారు, కనుక తమ బ్రాండింగ్ కు వచ్చిన నష్టం ఏమీ లేదనే భావనతో, కార్పోరేట్ కంపెనీలు ఈ ఇన్-ఫిలిం బ్రాండింగ్ కు మొగ్గుచూపుతున్నాయి. ఈ ప్రక్రియ నిర్మాతకు-కార్పోరేట్ బ్రాండ్ కు ఉభయకుశలోపరి మార్గంగా ఏర్పడింది. దాంతో సినిమాలలో కార్పోరేట్ బ్రాండ్స్ కు స్థానం కల్పించడంకోసం నిర్మాణ సంస్థలు పనిచేస్తుండగా, తమ బ్రాండ్లకు ఆయా సినిమాలలో లభించే స్థానం ఆధారంగా కార్పోరేట్ సంస్థలు కొంతమొత్తం నిధులను సినిమా నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నాయి. దాంతో ఈ ప్రక్రియ అందరికీ ఆమోదయోగ్యంగా మారి విజయం వైపు పయనిస్తోంది.

కొత్తవారి చిత్రాలంటే పలుమార్లు ఆలోచిస్తున్న కార్పోరేట్  కంపెనీలు

సినిమా నిర్మాణ రంగంలో నూతనంగా ప్రవేశించే చాలామంది ఔత్సాహికులు, సినిమా కథనంలో కార్పోరేట్ బ్రాండింగ్ కు సరైన ప్లేస్ మెంట్ ఇస్తూ, మంచి కథ, కథనాలతో కార్పోరేట్ కంపెనీలను కలిసినా ఆయా కంపెనీల వారు, ఆ సినిమా ప్రాజెక్ట్ ను బూతద్దంలో పెట్టి చూస్తూ, తమ నిర్ణయాన్ని ఒకటికి పదిసార్లు వెనకకు వేస్తూ.. చివరికి, ఆ సినిమాకు "నో" చెప్పడమో, లేక అనేక శరతులు విధిస్తూ "ఓకే" చెయ్యడమో చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా నిర్మాణానికి కొత్తవారు, సినిమాను అనుకున్నట్లుగా తియ్యగలరో, లేదో, ఒక వేల సినిమా పూర్తి చేసినా సరైన క్రమంలో మంచి ప్రచారంతో విడుదల చేయగలరో.. లేదో ననే ఒకింత డైలమా వల్ల, కార్పోరేట్ కంపెనీలు కొత్తవారి చిత్రాలపట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నాయి.

కొత్తవారి చిత్రాలకూ ఇన్-ఫిలిం బ్రాండింగ్ సాధ్యమే

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, తన తొలి చిత్రం ఆనంద్ స్క్రిప్ట్ పట్టుకుని నాలుగు సంవత్సరాలపాటు సినిమా ఆఫీసులచుట్టూ ప్రదక్షిణలు చేశాడని చెబుతారు. అలాగే ఆయన చిత్రంలోని బ్రాండింగ్ కోసం ఎన్నెన్నో కార్పోరేట్ కంపెనీలచుట్టూ తిరిగారు. చివరికి ఎన్నో కష్టాలకోర్చి సినిమా పూర్తి చేసింతరువాత, సినిమా ప్రపంచం "ఆనంద్ - ఓ మంచి కాఫీ లాంటి సినిమా" అనకుండా ఉండలేకపోయారు. అందులో బ్రూ కాఫీకి మంచి ప్రాచుర్యం లభించింది. కనుక కొత్తవారి చిత్రాలకు బ్రాండింగ్ రాదనేది ఉత్తి మాట. సినిమాలో బ్రాండింగ్ కు సరైన స్పేస్ లభించాలి, దానిని నిర్మాణాత్మకంగా, చాకచక్యంగా, క్యాలిక్యులేటెడ్ మెథడ్ తో స్క్రిప్టులో జతకూర్చి, కంపెనీలకు ప్రెజెంటేషన్ గా ఇస్తే, ఆ సినిమాకు సపోర్ట్ చెయ్యడానికి కార్పోరేట్ కంపెనీలు ఖచ్చితంగా ముందుకు వస్తాయి. అయితే ఆయా కార్పోరేట్ కంపెనీల బ్రాండ్స్ కు సినిమాలో ఎలా స్థానం కల్పించాలి, ఆతరువాత ఆయా కంపెనీల వారిని ఎలా అప్రోచ్ కావాలి, ప్రెజెంటేషన్ చేసే విధి విధానాలు ఏమిటి, ఏం చేస్తే కార్పోరేట్ కంపెనీలు ఇన్-ఫిలిం బ్రాండింగ్ కోసం ముందుకు వస్తాయి, చేయకూడని పనులేమిటి తదితర అత్యంత కీలకాంశాలు చాలా ముఖ్యం.

మీ సినిమాలో ఇన్-ఫిలిం బ్రాండింగ్ కోసం కంపెనీనుంచి ఎన్ని డబ్బులు అడగాలి?

ఇది మరో కీలక అంశం. మీ సినిమాలో బ్రాండ్ లేదా ప్రొడక్ట్ ప్లేస్ మెంట్ కోసం మీరెన్ని డబ్బులు అడగాలో మీకు తెలియకపోతే, అది మీ ఫెయిల్యూర్ క్రిందే లెఖ్ఖ. కార్పోరేట్ కంపెనీకి మీ సినిమాలోని ప్లేస్ మెంట్ కోసం ఇస్తున్న స్క్రీన్ టైం కు బదులుగా, మీ సినిమాలో ఆయా ప్రొడక్ట్ కోసం మీకెంత ఖర్చవుతోంది, ఆ ప్రొడక్ట్ బ్రాండింగ్ లో పాల్గొనే నటీనటులు ఎవరు? ఆ సినిమా టెక్నీషియన్లకు ఉన్న మార్కెట్ విలువెంత? మీ ప్రొడక్షన్ బ్రాండ్ వ్యల్యూ ఎంత? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆ ఖర్చులో 5 నుంచి 15 శాతం మీ ఫీజుగా కార్పోరేట్ కంపెనీ నుంచి వసూలు చెయ్యవచ్చు. కొన్ని సందర్భాలలో కార్పోరేట్ కంపెనీలు ఆఖర్చులో 35 శాతం దాకా వెచ్చించడానికీ సిద్దపడవచ్చు.

కార్పోరేట్ కంపెనీ సినిమాలలో తమ ప్రొడక్ట్ చూయించినందుకు డబ్బులెలా ఇస్తుంది?

ఒకసారి మీ సినిమాలోని బ్రాండింగ్ ప్లేస్ మెంట్ విషయంలో అంగీకారం తెలిపిన కార్పోరేట్ కంపెనీ, మీకు డబ్బు రూపంలోనో లేదా లొకేషన్స్ ఉచితంగా ఇవ్వడం, లేదా మీ సినిమాకు వెహికిల్స్ సమక్కొర్చడం, మీ సినిమా నటీనటుల ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు భరించడం, టూరిజం ఖర్చులు భరించడం, కెమెరా ఖర్చు లేదా యూనిట్ ఖర్చు భరించడం చేస్తారు. కొందరు పోట్ ప్రొడక్షన్స్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వసతే మరి కొందరు మీ సినిమా పబ్లిసిటీకి సంబంధించిన కొన్ని ఖర్చులను భరిస్తారు. అలా కాకుండా వారి బ్రాండింగ్ కు బదులుగా, మీకు డబ్బులు ఇవ్వడానికి వారు ఆసక్తి చూయిస్తే, ఆ మొత్తాన్ని 3 లేదా 4 భాగాలుగా ఇస్తారు. ఉదాహరణకు ఆ కంపెనీవారి ప్రొడక్ట్ షూటింగ్ ఉన్నప్పుడు కొంత, వారి ప్రొడక్ట్ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు మరికొంత మరియు మీ సినిమా పూర్తై సెన్సార్ అయిపోయిన తరువాత, మీరు వేసిన ప్రివ్యూ లో సినిమా చూసి, ఆ వెంటనే బ్యాలెన్స్ మొత్తం విడుదల చేస్తుంది. కొన్ని సందర్భాలలో మొత్తం డబ్బులను సదరు కంపెనీలు అడ్వాన్స్ గానే చెల్లిస్తాయి. ఈ విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో విధానాన్ని పాఠిస్తుంది.

కార్పోరేట్ కంపెనీతో మీటింగ్: మీ సినిమాకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా ఫండ్ ఏర్పాటు చేసుకోవడానికి రాజమార్గం 

ఒక కార్పోరేట్ కంపెనీని కలవడమంటే అంత ఈజీగా జరిగే పని కాదు. ఒక కార్పోరేట్ కంపెనీతో మీటంగ్ లో కూర్చుని, వారికి మీ ప్రాజెక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనే విషయాన్ని దర్శకనిర్మాతలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒకసారి ఒక కార్పోరేట్ కంపెనీ మీటింగ్ కు మిమ్మల్ని పిలిచి, మీ ప్రెజెంటేషన్ కంపెనీకి నచ్చకపోతే, మళ్ళీ ఆ కంపెనీని కలవడం 99% శాతం సాధ్యం కాకపోవచ్చుననే నిజాన్ని గమనించండి.

ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా మీ సినిమాకు కార్పోరేట్ బ్రాండింగ్ ఫండ్ సమకూర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదో తెలుసుకోండి. 

ఇది, తమ సినిమాలో ఇన్-ఫిలిం బ్రాండింగ్ సహకారం తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ జాగ్రతగా గమనించాలసిన అంశం. తమ ప్రాజెక్ట్ ఎంతో అద్భుతంగా ఉన్నా, తెలీకుండా చేసే చిన్న తప్పిదం వల్ల, కార్పోరేట్ కంపెనీ మీ సినిమాను తిరస్కరించవచ్చు. లేదా ఇన్-ఫిలిం ఆధారిత స్క్రిప్ట్ తో సినిమా నిర్మించడంపై మీకు ఉన్న అవగాహన చూసి, మీ సినిమాకు పచ్చజెండా ఊపనూవచ్చు. కనుక క్రింది నియమాలు తప్పకుందా పాఠించండి.

ముందుగా మీరు తెలుసుకోవలసినవి.

- మీరు వ్రాసుకున్న కథలో ఎటువంటి బ్రాండ్స్ కు స్థానం ఉంది
- మీ కథలో ఉన్న బ్రాండ్లకు సంబంధించిన కంపెనీలు ఎక్కడ ఉన్నాయి
- ఆయా కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటెజీ ఏమిటి
- ఆయా కంపెనీల టార్గెటెడ్ కష్టమర్స్ ఎవరు
- ఆయా కంపెనీల మార్కెటింగ్ & అడ్వర్టైజ్మెంట్ సిస్టెం ఏమిటి
- సి.ఎస్.ఆర్ యాక్టివిటీ క్రింద వారేం చేస్తారు

మీరు చెయ్యవలసినవి 

- ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి 
- కార్పోరేట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకోండి
 - అనాలసిస్ & మార్కెటింగ్ గ్రాఫ్ రిపోర్ట్ చేసుకోండి 
- కార్పోరేట్ కంపెనీ మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ ని సంప్రదించండి 
- మీ సినిమాలో వారి బ్రాండ్ కు ఎటువంటి స్థానం ఉందో చెప్పండి 
- మీ సినిమా వల్ల వారికి కలిగే లాభం ఏమిటో చెప్పండి 
- మీ సినిమాకు మార్కెటింగ్ & బ్రాండింగ్ అడ్వైజర్ ఎవరో చెప్పండి  
- మీ మార్కెటింగ్ ప్లాన్ చెప్పండి 
- మీకు సినిమా పరిశ్రమలో ఎవరి సపోర్ట్ ఉందో చెప్పండి 
- మీ ప్రొఫైల్ మరియు మీ మార్కెటింగ్ అడ్వైజర్ ప్రొఫైల్ ఖచ్చితంగా ప్రెజెంటేషన్ తోబాటు వారికి ఇవ్వండి 
- మీకు ఏం కావాలి, ప్రతి ఫలంగా కంపెనీకి ఎటువంటి లాభం, మైలేజ్ తదితరాలను క్షుణ్ణంగా వివరించండి  

ఏం చెయ్యకూడదు

- అబద్దాలు చెప్పకండి
 - గొప్పలకు పోకండి  
- మీరే బ్రాండు చెబితే అది చూయిస్తాం ... ఎంతసేపంటే అంతసేపు చూయిస్తాం అని చెప్పొద్దు
- అనాలసిస్ & మార్కెటింగ్ గ్రాఫ్ రిపోర్ట్ లేకుండా వెళ్ళకండి
- డబ్బే ఇంపార్టెంట్ అన్నట్లుగా మాట్లాడకండి
- వెళ్ళిన కంపెనీని అదేపనిగా పొగడకండి
- భాషలో స్వచ్చత, స్పష్టత చాలా అవసరం 
- మార్కెటింగ్ లో ఎక్కువశాతం నార్త్ ఇండియన్స్ ఉంటారు - ఇంగ్లీషు లేదా హిందీలో మాట్లాడితే బావుంటుంది 
- తప్పనిసరై తెలుగులో మాట్లాడవలసి వచ్చినా ప్రాజెక్ట్ రిపోర్ట్, మార్కెటింగ్ గ్రాఫ్ చూయిస్తూ మాట్లాడండి   

మాకన్నీ తెలుసని తప్పులో కాలేయకండి.   

ఇన్-ఫిలిం బ్రాండింగా... ఏదైనా ఓ బైక్ గానీ, కారు గానీ సినిమాలో చూయిస్తే సరి. ఆ కంపెనీల వాళ్ళు డబ్బులిస్తారు. ఫైట్ జరుగుతున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఓ రెండు హోర్డింగులు, పాటలో మరో రెండు, ఓ బస్టాప్ సీన్... ఇవి చాలు నా సినిమాకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా డబ్బులు రాబట్టుకోవడానికి... అని నూటికి తొంబై శాతం మంది అనుకుంటారు. కానీ అది తప్పు. మీ సినిమాలో అక్కడక్కడా చూయించడంకోసం ఏ కంపెనీ డబ్బులు ఇవ్వదు. ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా సినిమాలలో వస్తువుల ప్రచారానికి ఓ ప్రత్యేక మెథడ్ ఉంది. దానికి తగినట్లుగా తీర్చిదిద్దుకుని ముందుకు వెళితేనే... సినిమాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ సాధ్యం. మాకన్నీ తెలుసని ముందుకెళితే సమయం వృధా తప్ప, చివరికి బ్రాండ్స్ వారిని ఒప్పించలేరు. "ఇది, ఏదో రోగం వస్తే తమకు తెలీకపోయినా స్వంత వైద్యం చేసుకున్నదానికిందే లెక్క". రోగానికి మందు కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంత అవసరమో, కార్పోరేట్ బ్రాండింగ్ విషయంలో కంపెనీని ఒప్పించడానికి, బ్రాండింగ్ నిపుణుల సహాయ, సహకారాలు తీసుకోవడం అంతే అవసరమన్న విషయం గుర్తుంచుకోండి. 

సినెటేరియా సహకారంతో ఇన్-ఫిలిం బ్రాండింగ్ ఫండ్ ఏర్పాటు చేసుకోండి 

ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా తమ సినిమాలకు కార్పోరేట్ బ్రాండింగ్ ఫండ్ సమకూర్చుకోవాలనుకునే చిత్ర నిర్మాతలు, దర్శకులు మరియు ఇతర ఆసక్తి పరులకు సినెటేరియా మీడియా వర్క్స్ సహకరిస్తుంది. ఇందుకోసం సినెటేరియా మూడు విధాలైన సర్వీసెస్ కు రూపకల్పన చేసింది. తద్వారా స్వంతంగా కార్పోరేట్ కంపెనీలను కలిసి ఫండ్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికోసం మరియు స్వంతంగా మార్కెటింగ్ చేసుకోలేక పూర్తిగా సినెటేరియా సేవలను వినియోగించు కోవాలనుకునే వారికోసం ఇన్-ఫిలిం బ్రాండింగ్ సహకారాన్ని సినెటెరియా అందిస్తుంది.

1. ఇన్-ఫిలిం బ్రాండింగ్ అడ్వైజరీ సర్వీసెస్ 

(సినెటేరియా బ్రాండ్ అడ్వైజరీ సర్వీసెస్ సహకారంతో మీ సినిమాను మీరే మార్కెట్ చేసుకుని, కంపెనీలవారితో మీరే స్వయంగా మాట్లాడి మీ సినిమాకు స్పాన్సర్షిప్ సపోర్ట్ తెచ్చుకోవచ్చు. ఇందుకోసం సినెటేరియా మీకు ఆర్థికంగా, ప్రొమోషన్ పరంగా లాభం కలిగేలా కీలకమైన సలహాలు & సూచనలు చేస్తుంది.) 
- మీ సినిమా కథలో ఉన్న బ్రాండింగ్ అవకాశాలు ఐడెంటిఫై చెయ్యడం  
- మీ కథ, కథనాలలో మరిన్ని బ్రాండింగ్ అవకాశాలకు స్థానం కల్పించడం   
- మీ సినిమాకు అవసరమయ్యే మార్కెటింగ్ స్ట్రాటెజీ డెవలప్ చెయ్యడం  
- కార్పోరేట్ కంపెనీలను ఎలా కలవాలి సూచించడం- ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసే విధానంపై సలహాలు  
- సూచనలు - సినిమా విడుదల సమయంలో బెట్టర్ ప్రొమోషనల్ ప్లానింగ్  
- ఇలా ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తుంది

2. ఇన్-ఫిలిం బ్రాండింగ్ మార్కెటింగ్ సపోర్ట్ & అడ్వైజరీ సర్వీసెస్ 

(సినెటేరియా మీ చిత్రానికి ఇచ్చే మార్కెటింగ్ సపోర్ట్ & అడ్వైజరీ సర్వీసెస్, మీ సినిమాకు ఎక్కువ కార్పోరేట్ ఫండింగ్ సమకూరడానికి తోడ్పాటు అందిస్తుంది. సినెటేరియా తయారు చేసి ఇచ్చే ప్రాజెక్ట్ రిపోర్ట్, కార్పోరేట్ ప్రెజెంటేషన్, బ్రాండింగ్ అనాలసిస్ & మార్కెటింగ్ గ్రాఫ్ రిపోర్ట్ ల వల్ల, కార్పోరేట్ కంపెనీలు మీ సినిమాతో ముందుకు సాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. పైగా కార్పోరేట్ కంపెనీల అడ్రెస్, కాంటాక్ట్ పర్సన్ డిటెయిల్స్, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ లను సినెటేరియానే సమకూరుస్తుంది. దాంతో కంపెనీలను కలిసి మీ ప్రొపోజల్ చెప్పి మీ సినిమాకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ తెచ్చుకోవడం మీకు ఈజీ.   మీ సినిమాకుమీరే మార్కెట్ చేసుకుని, కంపెనీలవారితో మీరే స్వయంగా మాట్లాడి మీ సినిమాకు స్పాన్సర్షిప్ సపోర్ట్ తెచ్చుకోవచ్చు.) 
- పైన పేర్కొన్న ఇన్-ఫిలిం బ్రాండింగ్ అడ్వైజరీ సర్వీసెస్ అన్నీ ఇస్తూనే, అదనంగా 
- మీ సినిమాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం  
- మీ సినిమాకు కార్పోరేట్ ప్రెజెంటేషన్ తయారు చేసి ఇవ్వడం 
- మీ సినిమాకు అనాలసిస్ & మార్కెటింగ్ గ్రాఫ్ రిపోర్ట్ తయారుచేసి ఇవ్వడం 
- మీరు ఏఏ కంపెనీలను కలవాలో సూచిస్తూ కంపెనీల లిస్ట్ ఇవ్వడం 
 - ఆయా కంపెనీల అడ్రెస్స్, కాంటాక్ట్ పర్సన్స్, ఇంపార్టెంట్ ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు ఇవ్వడం 
- మీ సినిమాల విడుదల సమయంలో స్పాన్సర్షిప్ కోసం మా సపోర్ట్

3. మీ సినిమాలకు సినెనెటేరియా ఇన్-ఫిలిం బ్రాండ్ మేనేజర్ వ్యవహరించడం

(సినెటేరియా మీ చిత్రానికి ఇన్-ఫిలిం బ్రాండ్ మేనేజర్ గా వ్యవహరించడం వల్ల, మీ సినిమాకు సంబంధించిన ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్-ఫిలిం బ్రాండింగ్, ప్రొమోషనల్ బ్రాండింగ్, బ్రాండ్ ఎండార్స్ మెంట్ విత్ ఫిలిం బాద్యతలనూ, నిర్మాత తరఫున సినెటేరియానే ప్రత్యక్షంగా పనిచేస్తుంది. సినిమాలోని బ్రాండింగ్ అవకాశాలను కార్పోరేట్ కంపెనీలతో మాట్లాడి ఫండ్ రైజింగ్ చేస్తుంది. అలాగే సినిమా ప్రొమోషనల్ యాక్టివిటీస్ భాధ్యతలను సమర్థంగా నిర్వహించి, నిర్మాతకు కొన్ని లక్షల రూపాయల ఆర్థిక తోడ్పాటు లభించేలా సినెటేరియా వ్యవహరిస్తుంది.)
-  మీ సినిమాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం
- మీ సినిమాకు కార్పోరేట్ ప్రెజెంటేషన్ తయారు చేయడం 
- మీ సినిమాకు అనాలసిస్ & మార్కెటింగ్ గ్రాఫ్ రిపోర్ట్ చేయడం 
- మీ స్టోరీ రీసెర్చ్ ద్వారా బ్రాండింగ్ ప్లేస్ మెంట్స్ అనలైజ్ చెయ్యడం
- అప్రోచింగ్ కంపెనీల ఐడెంటిఫికేషన్
- కార్పోరేట్ అప్రోచ్  & కార్పోరేట్ మీటింగ్స్
- ప్రొడ్యూసర్ & కార్పోరేట్ కంపెనీ మీటింగ్స్
- ఇన్-ఫిలిం బ్రాండింగ్ డీల్ క్లోజింగ్స్
- ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విత్ ఫిలిం
- ఇన్-ఫిలిం బ్రాండింగ్ ప్లేస్ మెంట్స్ స్క్రిప్ట్ ఫైనలైజేషన్
- ఇన్-ఫిలిం అగ్రిమెంట్స్ విత్ బ్రాండ్స్ / కార్పోరేట్స్
- కో-ఆర్డినేషన్ విత్ ప్రొడ్యూసర్, దైరెక్టర్ & కార్పోరేట్ కంపెనీ
- ఫాలో అప్స్ ఫర్ కార్పోరేట్ పేమెంట్స్ ఫర్ ప్రొడ్యూసర్
- కార్పోరేట్ & ప్రొడ్యూసర్ ఫైనల్ అకౌంట్స్ సెటిల్ మెంట్ 

మరిన్ని వివరాలకోసం మమ్మల్ని సంప్రదించండి.