మా గురించి


సినిటేరియా మీడియా వర్క్స్ ఎల్‌ఎల్‌పి, హైదరాబాద్ (తెలంగాణ, ఇండియా) సినిమా నిర్మాణం, సినిమాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్-ఫిలిం బ్రాండింగ్, సినిమాల పంపిణీ, సినిమాల మార్కెటింగ్, సినిమాల రైట్స్ డబ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ తదితరాలకు అమ్మకం, మరియు వెబ్ సిరీస్ ల నిర్మాణం తదితర సేవలను అందిస్తోంది.

సినిమాల నిర్మాణంలో ప్రతిభకు పట్టం కట్టాలని సినెటేరియా స్థిరచిత్తంతో ఉంది. అదే దిశతో తొలి చిత్రం సర్వం సిద్దం లో 20మని నూతన నటీననటులు, కొందరు టెక్నీషియన్లకు అవకాశం ఇచ్చింది. అలాగే రెండవ చిత్రం రుద్రం భజే లో 35 మంది నూతన నటీనటులకు అవకాశం కల్పించింది.

సినిమా నిర్మాత సేఫ్ గా ఉంటే... సినిమా పరిశ్రమ సేఫ్ గా ఉంటుందని సినెటేరియా నమ్ముతుంది. అందుకని సినిమా నిర్మాతల చిత్రాల నిర్మాణ వ్యయం తగ్గించడంకోసం సినెటేరియా క్ర్షిచేస్తోంది. సినిమాలలో కథానుసారం ప్రొడక్ట్ ప్లేస్మెంట్, ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్-ఫిలిం బ్రాండింగ్, సినిమా పబ్లిసిటీ తదితరాలలో కార్పోరేట్ కంపెనీలతో అనుసంధానమై పనిచేస్తుంది. అటు కార్పోరేట్ కంపెనీలకు సినిమాల ద్వారా ప్రచారం ... ఇటు సినిమా నిర్మాతలకు కార్పోరేట్ ప్రొమోషనల్ ఫండింగ్ ద్వారా ఆర్థిక సహకారం ఇస్తూ చిత్రాల నిర్మాణ వ్యయం తగ్గించడంకోసం, నిర్మాతలను సేఫ్ గా ఉంచడంకోసం సినెటేరియా కృషిచేస్తోంది.

సినెటేరియా మీడియా వర్క్స్ ఎల్.ఎల్.పి, అత్యంత ప్రతిష్టత్మకంగా అంతర్జాతీయ స్థాయి సినిమా వార్తల వెబ్ సైట్ సినెటేరియా.కాం (www.cinetaria.com)రూపొందిస్తోంది. అతి త్వరలో లైవ్ లోకి రానున్న ఈ వెబ్ సైట్ లో స్థాయిక, దేశీయ, జాతీయ మరియు అంతర్జీతీయ వార్తలకు ప్రత్యేక స్థానం ఉండటం తోబాట్లు, ప్రపంచ సినిమాను కళ్ళముందు సాక్షాత్కరించనుంది.

ఇన్-ఫిలిం బ్రాండింగ్ సేవలను సినెటేరియా వెబ్ సిరీస్ మరియు టెలివిజన్ షోల నిర్మాతలకు కూడా అందిస్తోంది.