సర్వం సిద్దం

పూర్తి స్థాయిలో 100% శాతం కామెడీ తో కూడిన కథతో సర్వం సిద్దం (నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత) సినిమాను సినెటేరియా మీడియా వర్క్స్ నిర్మించింది. ప్రతిభావంతులైన నూతన తారాగణంతో నిర్మించిన ఈ చిత్రానికి అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వం వహించారు.

సినాప్సిస్:
సినిమా దర్శకత్వమంటే అక్షరం ముక్క కూడా తెలీని సర్వం ఎలాగైనా ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని బలమైన కోరికతో ఉంటాడు. అందుకోసం ఏడుగురు హీరోలు, ఏడుగురు హీరోయిన్లతో ఏడు రొమాంటిక్ లవ్ స్టోరీస్ కలిపి ఒక సినిమా కథ తయారు చేసుకుంటాడు. ఆ కథతో తనకు దర్శకత్వం లో అవకాశం ఇవ్వవలసిందిగా చాలా మంది నిర్మాతలను కలిసినీ, ఎవ్వరూ అతనితో సినిమా చెయ్యడానికి ముందుకురారు. అప్పుడు, సర్వం ఒక నిర్మాతకు బ్లాక్ మెయిల్ చేసి, తన దర్శకత్వంలో తన ఏడు రోమాంటిక్ కథలతో సినిమా తీసేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. దర్శకత్వం గురించి ఏమీ తెలీని సర్వం ఆ సినిమాకు దర్శకత్వం ఎలా వహించాడు? అతను విజయం సాధిస్తాడా? లేదా? చివరికి ఏం జరిగింది అనేదే మెయిన్ స్టోరీ.

నటీనటులు :
గోవింద్ రాజ్ నీరుడి ముఖ్య పాత్ర పోశించిన ఈ చిత్రంలో కిరణ్ మాడసాని, మందార్ రామక్రిష్ణన్, రామ్ రోమియో, త్రిశాంక్, బొబ్బిలి సంతోష్ రెడ్డి, చరణ్, సిద్దేశ్వర్, పూజ, లావణ్య, సరిత, అనుపమ, రావళి, వెంకటేష్, అభిషేక్, అర్జున్, ఫరీనా, శివ, డేవిడ్, యశ్వంత్, రాహుల్ షా, వి.వి. సన్యాసి రావు, వినోద్ కుమార్ సోమరాజు, కీర్తిష్, సాగర్, ప్రకాష్, శిరీషా దాసరి, విక్రమ్ తదితరులు ఈ చిత్రంలోని ఇతర తారాగణం.

విడుదల: జూన్ 17, 2021

ఇంకా చూడండి

రుద్రం భజే

సినెటేరియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం రుద్రం భజే. సినెటేరియా అధినేత, నంది అవార్డు గ్రహీత వెంకట్ బులెమోని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ మరియు దుబాయ్ లలో ఏక కాలంలో జరిగింది. ప్రపంచంలో వర్చువల్ టెక్నాలజీ ఉపయోగించుకుని, ఏకకాలంలో రెండు ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి లాక్ డౌన్ టైం లో జపడం విశేషం.

సినాప్సిస్ :
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న పరిస్థితులలో దుబాయ్ లో లాక్ డౌన్ లో ఉన్న తండ్రి, హైదరాబాద్ లో కాలేజ్ హాస్టల్ లో ఉన్న తన కూతురిని అత్యంత కిరాతకుడైన శతృవునుంచి కాపాడుకోవడానికి ఏం చేశాడు. ఆ అమ్మాయిని ఎవరు రక్షించారు. చివరికి ఏం జరిగింది. అనేదే ముఖ్యమైన కథనం.

ముఖ్య తారలు:
కుశలవ్ కుమార్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ఇండో-అమెరికన్ యాక్టర్ శ్రీ చరన్ అత్యంత కిరాతకమైన విలన్ గా నటిస్తూండగా, అనేక చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్న బేబి హన్సిక మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. దుబాయి కి చెందిన ఆనంద్ కేశవ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇతర నటీనటులు:
మిస్టర్ నవీన్, మిస్టర్ శేఖర్ సింగంపల్లి, మిస్టర్ షరాశ్, మిస్టర్ మణి పటేల్, మిస్టర్ శివ, మిస్టర్ గోపాల్ అలుకా, మిస్టర్ సతీష్ దాసారం, మిస్టర్ బి. శ్రీనివాస్, మిస్టర్ భాస్కర్ మేకల, మిస్టర్. టిక్ టాక్క్ స్వామి, మిస్టర్ కృష్ణ, మిస్టర్ యాద్గర్పల్లి కృష్ణ, శ్రీమతి ప్రవల్లిక, మిస్టర్ చంద్ర శేఖర్ మునగంటి, డాక్టర్ మనోజ్ చిలువేరు, డాక్టర్ జిబి ప్రసాద్, మిస్టర్ గౌతమ్ సాయి, మిస్టర్ మహేష్, మిస్టర్ సాయి (జూనియర్ రామ్రెడ్డి), మిస్టర్ సైకో స్వామి తదితరులు ఈ చిత్రంలోని ఇతర ముఖ్యమైన నటులు.

విడుదల: సెప్టెంబర్ 2021

ఇంకా చూడండి
See More
-->