(నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత)

పూర్తి స్థాయిలో 100% శాతం కామెడీ తో కూడిన కథతో సర్వం సిద్దం (నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత) సినిమాను సినెటేరియా మీడియా వర్క్స్ నిర్మించింది. ప్రతిభావంతులైన నూతన తారాగణంతో నిర్మించిన ఈ చిత్రానికి అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వం వహించారు.

సినాప్సిస్:
సినిమా దర్శకత్వమంటే అక్షరం ముక్క కూడా తెలీని సర్వం ఎలాగైనా ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని బలమైన కోరికతో ఉంటాడు. అందుకోసం ఏడుగురు హీరోలు, ఏడుగురు హీరోయిన్లతో ఏడు రొమాంటిక్ లవ్ స్టోరీస్ కలిపి ఒక సినిమా కథ తయారు చేసుకుంటాడు. ఆ కథతో తనకు దర్శకత్వం లో అవకాశం ఇవ్వవలసిందిగా చాలా మంది నిర్మాతలను కలిసినీ, ఎవ్వరూ అతనితో సినిమా చెయ్యడానికి ముందుకురారు. అప్పుడు, సర్వం ఒక నిర్మాతకు బ్లాక్ మెయిల్ చేసి, తన దర్శకత్వంలో తన ఏడు రోమాంటిక్ కథలతో సినిమా తీసేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. దర్శకత్వం గురించి ఏమీ తెలీని సర్వం ఆ సినిమాకు దర్శకత్వం ఎలా వహించాడు? అతను విజయం సాధిస్తాడా? లేదా? చివరికి ఏం జరిగింది అనేదే మెయిన్ స్టోరీ.

విడుదల: జూలై 2021
ఇంకా చూడండి

(ఎక్స్‌ట్రీమ్ ఎమోషనల్ ఎడ్జ్ ఆఫ్ లవ్)

అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన మ్యూజికల్ లవ్ స్టోరీతో నిర్మించిన ఈ "తీరం" చిత్రంలో శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, అపర్ణ, క్రిష్టెన్ రవళి నాయికా నాయకులుగా నటించారు. రచన, దర్శకత్వం: అనిల్ ఇనమడుగు.

సినాప్సిస్:
శ్రావన్ మరియు అప్పు చిన్ననాటి స్నేహితులు. అప్పు శ్రావన్ ని చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉంటుంది. తన ప్రేమను వ్యక్తపరచడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కాని శ్రావన్ అప్పు ప్రేమను అర్థం చేసుకోక, ఒక స్నేహితురాలిగానే చూస్తూంటాడు. అర్జున్ కాలేజీలో సీనియర్ విద్యార్థి. డ్రగ్స్ కు బానిసై తన గ్యాంగ్ సభ్యులతో కని ఎప్పుడూ విద్యార్థులను ర్యాగింగ్ చేసే అర్జున్, - అప్పూ, శ్రావణ్ లు చదువుకునే కాలేజీలోనే చదువుకుంటూంటాడు. తన స్నేహితునికి వచ్చిన సమస్య తీర్చడానికి శ్రావన్ ఊరికి వెళ్ళినరోజే, అప్పూకు ఒక తీవ్రమైన సమస్య వస్తుంది. తన సమస్యను శ్రావన్ కు చెబుదామని అప్పూ ఎంత ప్రయత్నించినా, శ్రావన్ ఫోన్ కలవదు. అదే సమయంలో అప్పూ ను తాను ప్రేమిస్తున్నానని గుర్తిస్తాడు శ్రావణ్. ఎంతో ఆతృతతో అప్పూకు తన ప్రేమ చెబుదామని ఊరికి వచ్చిన శ్రావణ్, అప్పూ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో షాక్ కు గురవుతాడు.   ఇంకా చూడండి

ద స్టోరీ బిగిన్స్ ...

సినెటేరియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం రుద్రం భజే. సినెటేరియా అధినేత, నంది అవార్డు గ్రహీత వెంకట్ బులెమోని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ మరియు దుబాయ్ లలో ఏక కాలంలో జరిగింది. ప్రపంచంలో వర్చువల్ టెక్నాలజీ ఉపయోగించుకుని, ఏకకాలంలో రెండు ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి లాక్ డౌన్ టైం లో జపడం విశేషం.

సినాప్సిస్:
కొవిడ్ మూలంగా దుబాయ్ లో లాక్డౌన్ విధిస్తారు, విమానాలు రద్దవడంతో అనివార్యమైన పరిస్థితులలో, మిస్టర్ ఆనంద్ కేశవ దుబాయ్ లోనే ఉండిపోవలసి వస్తుంది. మిస్టర్ ఆనంద్ కేశవ్ కుమార్తె బేబీ నిత్య హైదరాబాద్ లోని ఒక హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. మిస్టర్ ఆనంద్ కేశవ పట్ల శత్రుత్వం పెంచుకున్న ఒక డేజరస్ క్రిమినల్ మిస్టర్ దండు రాజ్, ఆనంద్ కేశవ కుమార్తె బేబీ నిత్యాను చంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తున్నాడు. దుబాయిలో లాక్డౌన్ లో చిక్కుకుపోయిన ఆనంద్ కేశవ, హైదరాబాదులోని తన కూతురును ఎలా కాపాడుకున్నాడు. ఆనంద్ కేశవకు ఎవరు సహకరించారు, అనేదే మూల కథ.

  ఇంకా చూడండి

-->