సర్వం సిద్దం

(నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత)

పూర్తి స్థాయిలో 100% శాతం కామెడీ తో కూడిన కథతో సర్వం సిద్దం (నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత) సినిమాను సినెటేరియా మీడియా వర్క్స్ నిర్మించింది. ప్రతిభావంతులైన నూతన తారాగణంతో నిర్మించిన ఈ చిత్రానికి అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వం వహించారు.

సినాప్సిస్:
సినిమా దర్శకత్వమంటే అక్షరం ముక్క కూడా తెలీని సర్వం ఎలాగైనా ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని బలమైన కోరికతో ఉంటాడు. అందుకోసం ఏడుగురు హీరోలు, ఏడుగురు హీరోయిన్లతో ఏడు రొమాంటిక్ లవ్ స్టోరీస్ కలిపి ఒక సినిమా కథ తయారు చేసుకుంటాడు. ఆ కథతో తనకు దర్శకత్వం లో అవకాశం ఇవ్వవలసిందిగా చాలా మంది నిర్మాతలను కలిసినీ, ఎవ్వరూ అతనితో సినిమా చెయ్యడానికి ముందుకురారు. అప్పుడు, సర్వం ఒక నిర్మాతకు బ్లాక్ మెయిల్ చేసి, తన దర్శకత్వంలో తన ఏడు రోమాంటిక్ కథలతో సినిమా తీసేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. దర్శకత్వం గురించి ఏమీ తెలీని సర్వం ఆ సినిమాకు దర్శకత్వం ఎలా వహించాడు? అతను విజయం సాధిస్తాడా? లేదా? చివరికి ఏం జరిగింది అనేదే మెయిన్ స్టోరీ.

నటీనటులు :
గోవింద్ రాజ్ నీరుడి ముఖ్య పాత్ర పోశించిన ఈ చిత్రంలో కిరణ్ మాడసాని, మందార్ రామక్రిష్ణన్, రామ్ రోమియో, త్రిశాంక్, బొబ్బిలి సంతోష్ రెడ్డి, చరణ్, సిద్దేశ్వర్, పూజ, లావణ్య, సరిత, అనుపమ, రావళి, వెంకటేష్, అభిషేక్, అర్జున్, ఫరీనా, శివ, డేవిడ్, యశ్వంత్, రాహుల్ షా, వి.వి. సన్యాసి రావు, వినోద్ కుమార్ సోమరాజు, కీర్తిష్, సాగర్, ప్రకాష్, శిరీషా దాసరి, విక్రమ్ తదితరులు ఈ చిత్రంలోని ఇతర తారాగణం.

టెక్నీషియన్లు:
నిర్మాతలు: శ్రీమతి శ్రీలత బి. వెంకట్ & మిస్టర్ వెంకటేశ్వర్లు బులెమోని
రచన, దర్శకత్వం: అతిమల్ల రాబిన్ నాయుడు
సినెమాటోగ్రఫీ: బొబ్బిలి సంతోష్ రెడ్డి
సంగీతం: డేవిడ్. జి
ఎడిటర్: కిరన్ రెడ్డి. ఎం
డి.ఐ. కలరిస్ట్: కృష్ణ వీరవల్లి
లైన్ ఎడిటర్స్: సురేంద్ర & సాయి కుమార్ ఆకుల
వి.ఎఫ్.ఎక్స్: మిస్టర్ కృష్ణ, ఎస్.వి. వి.ఎఫ్.ఎక్స్
స్టూడియో: విజన్ స్టూడియోస్, హైదరాబాద్
పి.ఆర్.ఒ: మిస్టర్ సురేష్ జిల్లా

విడుదల: ఆగస్టు 13, 2021

సర్వం సిద్దం (నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత) చిత్రం యొక్క మరింత సమాచారం కోసం సంప్రదించండి. ఫోన్ నెంబర్: +91 8688 512 528.